తెలంగాణ – అభివృద్ధి

కరీంనగర్‌ ఉప ఎన్నిక పుణ్యమా అని ఏ మంత్రినోట విన్నా అభివృద్ధి మాటే. ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి అయితే తెలంగాణ మరీ ముఖ్యంగా కరీంనగర్‌ జిల్లా తీరాంధ్రంలోని ఏ జిల్లాతోనైనా పోటీ పడేట్టు చేస్తానని అంటు న్నారు. ‘జల యజ్ఞం’ కార్యక్రమాన్ని చేపట్టింది తెలంగాణ, ఇత ర వెనుకబడిన ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికేనని ఆయన అంటున్నారు. సరే, ‘అభివృద్ధి’ ఇతర రంగాలలో ఎలా ఉందన్న సంగతి అలావుంచి రాజశేఖర్‌ ప్రతిష్ఠాత్మకంగా చేప ట్టిన జలయజ్ఞం కరీంనగర్‌ జిల్లాలో ఏ విధంగా సాగుతుందో చూద్దాము. కరీంనగర్‌ జిల్లాలో సాగునీటి సదుపాయాల మెరు గుదల పనులు ప్రధానంగా రెండు జరుగుతున్నాయి. అవి: (అ) శ్రీరాంసాగర్‌ వరద కాలువ; (ఆ) శ్రీపాదసాగర్‌ అనబడే ఎల్లంపల్లి ప్రాజెక్టు. శ్రీరాంసాగర్‌ వరద కాలువ ద్వారా 1.30 లక్షలు, శ్రీపాదసాగర్‌ పనుల ద్వారా దాదాపు 2 లక్షల ఎకరాల కు సాగునీటి సదుపాయం అందుతుందని ప్రభుత్వం చెబు తోంది. ఈ వెనుకబడిన జిల్లాలో 3.30 లక్షల ఎకరాలకు సాగు నీటి వసతి కల్పించడం మేము సాధించిన లేక సాధించబోతోన్న అభివృద్ధి అని రాజశేఖర్‌రెడ్డి, ఆయన మంత్రులు చెబుతున్నా రు. ఇంకా మున్ముందు శ్రీరాంసాగర్‌ ద్వారా మరో 1.61 లక్షలు, చొక్కారావు పథకం ద్వారా 11, 288 ఎకరాలకు నీరందిస్తామని వెరసి ‘జలయజ్ఞం’ ద్వారా తెలంగాణలో భారీ, మధ్యతరహా నీటి సరఫరా పథకాల ద్వారా సాగులోకి వచ్చే మొత్తం 34. 37 లక్షల ఎకరాలలో కరీంనగర్‌ జిల్లావాటా 5, 02, 588 ఎకరాలని ప్రభుత్వం ప్రకటించింది. ‘వాహ్‌- కరీంనగర్‌ ది ఏం అదృష్టం! ‘ అని ఎవరు ఈర్ష్యపడ్డా ఆశ్చర్య పోనక్కర్లేదు. మున్ముందు జరగ బోయే పనుల సంగతి అలా ఉంచి ఇప్పుడు చేపట్టిన వరద కాలవ, శ్రీపాదసాగర్‌ పనుల వివరాల్లోకి వెడదాం.

శ్రీరాంసాగర్‌ వరద కాలువలోకి నీరు రావాలంటే శ్రీరాం సాగర్‌ జలాశయంలోకి వరద నీరు తప్పనిసరిగా రావాలి. పోతి రెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ మాదిరిగా ‘వరద’ వచ్చినా, లేక ‘నికర జలాలు’ వచ్చినా తరలించడానికి ఇక్కడ వీలు పడదు. ఏమంటే ఈ జలాశయం పూర్తి స్థాయి 1091 అడుగులు మాత్ర మే. ప్రధాన కాలువ సిల్‌ లెవల్‌ 1010 అడుగులు; వరద కాలు వ సిల్‌ లెవల్‌ 1062 అడుగులు; వరదకాలువ పూర్తి స్థాయి- 1089.60 అడుగులు. అంటే జలాశయం పూర్తిగా నిండి వరద నీరు వస్తున్నప్పుడు మాత్రమే వరద కాలువలోకి నీటిని వదల టానికి వీలుంటుంది. (ఇదే పద్ధతిన పోతిరెడ్డిపాడుకు 875 అడు గుల స్థాయిలో మత్తడి ఏర్పాటు చేసి 885 అడుగుల నీటి మట్టా నికి దాపులో శ్రీశైలం జలాశయం ఉన్నప్పుడే ‘వరద’ నీటిని వద లాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రభుత్వం ససేమి రా అంటోంది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వైశాల్యాన్ని భారీగా పెంచుతోంది. అంటే శ్రీశైలం నుంచి ‘వరద’ రానప్పుడు కూడా నికర జలాలను నిక్షేపంలా తరలించడానికి ఆస్కారముం టుంది) శ్రీరాంసాగర్‌ వరద కాలువ ద్వారా మొత్తం 20 టిఎం సిల నీటిని ఉపయోగించి, 2.20 లక్షల ఎకరాలకు సాగునీరం దించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గమ్మత్తేమిటంటే వరద కాలువకు కేంద్ర జలసంఘం అనుమతి, ఇతర అనుమతులు పది సంవత్సరాల క్రితమే వచ్చాయి. కేంద్రజలసంఘం ఈ కాల వకు 20 టిఎంసిల నీటిని మంజూరు చేసింది. అయితే రాజశేఖ ర రెడ్డి ప్రభుత్వం ఆ ‘నికర’ జలాలను ‘వరద’ జలాలుగా మార్చింది. కరీంనగర్‌ ప్రజలు గమనించాల్సిన విషయమిది. వరద జలాలు ఈ కాలవలోకి రావాలంటే అది జరిగేది నాలుగై దేళ్ళకోసారి. గత పదేళ్ళలో వరదలు సంభవించింది రెండు పర్యాయాలు మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. అంటే 2000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయే ప్రాజెక్టు నాలుగేళ్ళకొకసారి మాత్రమే అని తెలుసుకొంటే ఎవరికైనా నిరు త్సాహంగానే ఉంటుంది. సరే, నాలుగేళ్ళకోసారి శ్రీరాంసాగర్‌ నిండి వరదలు వచ్చి వరద కాలువ నిండిందనుకుందాము. అయితే ఆ నీటిని నిలవ చేయడానికి అవసరమైన ముఖ్య జలా శయం ‘మిడ్‌ మానేరు’కు ఇంకా శంకుస్థాపనే జరగలేదు. దాదా పు 20 టిఎంసిల నీటిని నిలవ చేయగల ఈ మిడ్‌ మానేరును పూర్తి చేయడానికి కనీసం మూడేళ్ళు పడుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. అంటే 2010 నాటికి పూర్తవుతుందన్న మాట. సరే, మిడ్‌ మానేరు, అదనంగా మోతే వాగు తదితర చిన్న జలా శయాలు అప్పటికి పూర్తవుతాయనుకుందాము. పంట పొలా లకు నీటిని తెచ్చే డిస్ట్రిబ్యూటరీ కాలవలు, మైనర్లు, సబ్‌ మైన ర్లు, ఫీల్డ్‌ ఛానెల్స్‌ కూడా ఆ సమయానికి సిద్ధమయివుండాలి కదా. ఇంతవరకు వాటికి రూపకల్పన చేయనేలేదు. టెండర్లు పిలవలేదు. ఆ పని పూర్తికావడానికి ఐదేళ్ళు పడుతుంది. ఎస్‌ ఆర్‌ఎస్‌పి రెండో దశ పనులు మొదలయి 20 నెలలు కావచ్చినా 10శాతం భూసేకరణ కాకా ప్రాజెక్టు సకల అవస్థలు పడుతోం ది). అంటే ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలం గాణకే 54 శాతం నిధులను ఖర్చు పెట్టామని చేస్తోన్న ప్రచారం వల్ల ఎవరికి లాభం జరుగుతోంది? కేవలం ప్రధాన కాలువ నిర్మించడం వలనే లక్ష్యం నెరవేరుతుందా? రాజశేఖర్‌ హయాం లో ఒక్క ఎకరానికైనా నీరు అందుతుందా అనేది అనుమానమే. ‘ఊపిరి పీలుస్తున్నారంటే చాలదు/ సవాలు ఎందరు జీవిస్తు న్నారు?’; ‘కోట్లు ఖర్చు పెడుతున్నామంటే చాలదు; సవాలు రైతుకు ఎన్ని నీళ్లు అందిస్తున్నారన్న ‘ కవి వాణి స్ఫూర్తితో ప్రభు త్వాన్ని మనం నిలదీయాలి. మామూలుగా ఎన్ని ఎకరాలకు నీళ్ళిచ్చారని అడగాలి. అయితే ప్రభుత్వం అనుసరించే ద్వంద్వ నీతి (అంటే పోలవరం విషయంలో 1 టిఎంసికి 3800 ఎక రాలు, తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో 1 టిఎంసికి 15-25 వేల ఎకరాలు) మూలంగా ఎన్ని టిఎంసిల నీళ్లు ఇస్తున్నారని అడగవలసివస్తోంది. వరదకాలువలోకి అంతిమంగా నికర జలాలను అందించేది ప్రాణహిత స్కీం. అయితే ఇది ఇంకా బాలారిష్టాలనే ఎదుర్కొంటోంది. ప్రాణహిత లేకుండా మిడ్‌ మానేరు, ఇంకా చిన్న చిన్న జలాశయాలను నిర్మించకుండా డిస్ట్రిబ్యూటరీ స్కీం చేపట్టకుండా గోదావరి నీటిని ఈ పథకం ద్వారా 1.30 లక్షల ఎకరాలకు నీరు ఎలా అందిస్తారో భగవంతు డికే తెలియాలి. మన పాలకుల నిర్వాకం ఇంకా ఎలా ఉందో చూ డండి. మిడ్‌ మానేరు నుంచి అప్పర్‌ మానేరుకు ఒక టిఎంసి నీరు ఇవ్వడానికి ప్రభుత్వం సంసిద్ధత తెలియజేసింది. అంతేకా దు అందుకు పాలనా పరమైన అనుమతిని కూడా ఇచ్చింది. పోనీ ఆ అనుమతిలో ఎండిన అప్పర్‌ మానేరు జలాశయానికి అవసరమయిన 2 టిఎంసిల నీటిని ఇస్తున్నట్టుందా? ఊహూఁ- 1 టిఎంసియే! అప్పుడే అప్పర్‌ మానేరు ఆయకట్టు రైతులకు కష్టాలు తీరినట్టు ప్రజా ప్రతినిధులు ఆర్భాటంగా ప్రజలకు తమ అభివృద్ధి సాధన గురించి చెప్పుకొంటున్నారు.

ఇక శ్రీపాదసాగర్‌ సంగతి చూద్దాము. ఈ ప్రాజెక్టు పూర్తయితే 63 టిఎంసిల గోదావరి జలాలను ఉపయోగించుకొనే వీలుం టుంది. ఈ ప్రాజెక్టు బ్యారేజి నిర్మాణం నత్తనడక సాగుతోంది. ప్రస్తుతం 20 టిఎంసిల నీటిని ఈ ప్రాజెక్టు నుంచి ఎత్తి పోతల ద్వారా వినియోగించుకోవటానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. 8.5 టిఎంసిల నీటిని ఎన్‌టిపిసి కోసం, ఇంకా మంథని లోని 20 వేల ఎకరాలకు ఉపయోగించగా మిగిలే 12. 5 టిఎంసిల నీటిని రెండు భారీ పైపుల ద్వారా తరలించే ప్రక్రియ సాగుతోం ది. ఈ 12 టిఎంసిలలో 10 శాతం నీరు తాగునీటి అవసరాలకు ఉపయోగించగా మిగిలిన 10 లేక 11 టిఎంసిల నీటితో 2 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామా? ప్రభుత్వం రైతులకు అరచేతి లో స్వర్గం చూపుతోంది. 1 టిఎంసితో 20వేల ఎకరాలు సాగు చేస్తారన్నమాట! ఇది సాధ్యమయ్యే పనేనా? పైగా ఇప్పుడు జరుగుతున్న పనులు కేవలం పైపుల వేయడం మాత్రమే. ఈ నీటిని ఏ ఆయకట్టకు ఇస్తారో, ఏ డిస్ట్రిబ్యూటరీ సిస్టం ద్వారా ఇస్తారో ఏదీ నిర్ధారణ కాలేదు. అంటే ఎలాంటి ప్లానింగ్‌ లేకుం డా కేవలం వరద కాలువ (ప్రధాన కాలవ), 3 మీటర్ల వ్యాసం గల రెండు పైపుల నిర్మాణం చూపించి , ఫోటోలు వేసి, ప్రచా రం చేసి ‘మీ కరీంనగర్‌ జిల్లాను ఎంత అభివృద్ధి చేశామో చూడండి’ అని ప్రచారం చేయడం ఎంత మోసం? ఈ పనులు పూర్తయి, నిజంగా రైతుల పొలాలను గోదావరి జలాలతో తడప డానికి ఎంత కాలం పడుతుంది? అప్పుడైనా నికర జలాలు వస్తాయా? ఎలాంటి ఆలోచన లేకుండా, ముందు చూపులేకుం డా ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు కొనసాగించడం ప్రభు త్వం చేయదగ్గ పనికాదు. ఇప్పటికైనా ప్రభుత్వం టక్కుటమార గారడీలు మాని చిత్తశుద్ధితో పారదర్శకంగా వ్యవహరిస్తే బావుం టుంది. నీటి లభ్యత ఒక ఎత్తైతే, ఎత్తిపోతలకు అవసరమయ్యే విద్యుత్తు మరో ఎత్తు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పథకాల నిర్వహణకు అయ్యే ఖర్చును ఎవరి నెత్తిమీద రుద్దుతారు? ఇవి ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలే. మరి కరీంనగర్‌లో అభివృద్ధి అపారంగా జరుగుతోందన్న పాలక పక్ష నేతల ప్రచారంలో సత్యం పాలు ఎంతో ప్రజలే నిర్ణయించుకోవాలి.

వ్యాసకర్త:

ఆర్‌. విద్యాసాగరరావు

రిటైర్డ్‌ ఛీఫ్‌ ఇంజనీర్‌. Read More »

తెలుగువేరు, ఆంధ్రం వేరు! -కనకదుర్గ దంటు

…శంకరంబాడి సుందరాచారి అని బాపట్లకి చెందిన ఒక కవి ఈ తెలుగు తల్లిని సృష్టించాడు. అప్పటిదాకా ఎవరు రాసినా, ఎవరు మాట్లాడినా ‘ఆంధ్ర’ అన్న పదమే వాడేవారు. అయితే ఆంధ్ర అన్నది సంస్క­ృతానికి దగ్గరగా ఉండడంతో, లాలిత్యాన్ని తన పాటలో జొప్పించడానికి మొట్టమొదటి దోపిడీదారుగా ఆయన తెలంగాణకి సంబంధించిన ‘తెలుగు’ అన్న పదాన్ని దొంగిలించి తన పాటలో పెట్టుకున్నాడు.

Read More »